తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కే. మాధురి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికు విలేకరులతో మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపేటటువంటి అధికారులు సిబ్బందిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.