తిరువూరు పట్టణంలో మంగళవారం తిరువూరు ఆర్డీవో మాధురి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్థానికంగా నిత్యవసర సరుకుల స్టాక్ పాయింట్ ను ఆర్టిఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డు ప్రకారం సరుకులు ఉన్నాయో లేవో ఆర్డీవో విచారణ చేశారు. సరుకులు ప్రజలకు సకాలంలో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.