గంపలగూడెం మండలం పెనుగొలను వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద మంగళవారం నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పాము పుట్టలో పాలు పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు చిన్న పిల్లలకు చెవి పోగుల వేడుకలు నిర్వహించారు.