కంకిపాడు-గుడివాడ రహదారికి మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కంకిపాడు నుండి గుడివాడ వరకు సిపిఎం, వామపక్ష పార్టీల నాయకులు పాదయాత్ర చేపట్టారు. వీరికి మద్దతుగా పాల్గొన్న పలు స్వచ్ఛంద, సామాజిక సంస్థల సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.