నూజివీడు: సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నూజివీడు డిఎస్పి సత్య శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాలు పట్ల ప్రజలు అవగాహనతో కూడి ఉంటే మంచిదన్నారు. బాధితురాలు కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమె సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విధానంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. 40 లక్షలు పోగొట్టుకున్నట్లు బాధితురాలు చెబుతుంది.