ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం సిపిఎం శ్రేణులు తహాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ. నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టాలని, కరెంటు ట్రూ యాప్ చార్జీలు తగ్గించాలని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.