మైలవరం నియోజవర్గంలో బుధవారం భారీ వర్షం కురుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మైలవరం ప్రాంతం కూడా అతలాకుతమైంది. దీంతో ఈ ప్రాంతంలో వర్షం కురిస్తే స్థానికులకు భయమేస్తుంది. భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో ఈ ప్రాంతమంతా మేఘాలు చల్లబడిపోయి, చీకట్లో కమ్ముకొచ్చాయి. గత రెండు రోజులుగా మైలవరం పట్టణంలో వర్షం కురుస్తూనే ఉంది.