పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు శనివారం అందజేశారు. మైలవరంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. సరస్వతి ఫౌండేషన్ నిర్వాహకులు కుడుముల తిమ్మారెడ్డి అండ్ సన్స్ ఆధ్వర్యంలో 'ప్రతిభ పురస్కార అవార్డ్స్' ను అందజేశారు.