జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మైలవరం ప్రెస్ క్లబ్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్, ఎస్ఐ కె. సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మీడియా సోదరులు, పోలీసులు సమన్వయంతో సమాజానికి, ప్రజలకు అన్ని విధాలా మంచి జరిగేలా న్యాయంగా ముందడుగులు వేయాలని సూచించారు.