తెగిపోయిన కరెంటు వైరును సరి చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇబ్రహీంపట్నం ఫెర్రీ గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్ మెన్ కన్నా. వీరాంజనేయులు ( 39 ) మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. రాత్రి కురిసిన వర్షానికి రామాలయం వద్ద విద్యుత్ వైరు తెగిపోవడంతో మరమ్మత్తులు చేయడానికి వచ్చిన అసిస్టెంట్ లైన్ మెన్ వీరాంజనేయులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు.