జి.కొండూరు మండలం, కవులూరులో వరద ముంపునకు గురై దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను, గండి పడిన ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎంపీపీ పరిశీలించారు. పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చూడాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండా మరియమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు చెరుకూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.