ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పలుచోట్ల ఏపీ ఫుడ్ కమిషనర్ చింత ప్రతాప్ రెడ్డి ఆకస్మాత్ తనిఖీలు మరియు ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీలు కొనసాగాయి. మంగళవారం వివిధ గ్రామాల్లో పర్యటించిన ఫుడ్ కమిషనర్ మైలవరం నియోజకవర్గం లో గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ షాపులు మరియు అంగన్వాడి స్కూలు, తనిఖీ చేశారు. అనంతరం వివిధ చోట్ల గ్రామాల్లో జగనన్న ఇంటింటి రేషన్ సరుకులు పంపిణీ వాహనాల దగ్గరకు నేరుగా వెళ్లి వారి పనితీరును చూశారు.