సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. శనివారం మచిలీపట్నం 45వ డివిజన్లో మొదటిరోజు సభ్యత్వ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సభ్యత్వాలు నమోదు పెంచాలని పార్టీ శ్రేణులకు సూచించారు.