మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో వివిధ హోదాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాల కింద నియామాక పత్రాలు శనివారం అందుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ లు -04, లాబ్, రికార్డు, లైబ్రరీ అసిస్టెంట్ లు -07, కారుణ్య నియామకాల క్రింద ఆఫీస్ సబార్డినేట్ లు -04 మొత్తం 15 మందికి కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హరిక చేతుల మీదుగా ఉత్తర్వులు అందజేయడం జరిగింది.