కృష్ణా జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా వి. వి. నాయుడు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావుని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతలు మెరుగుపరిచే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ అడిషనల్ ఎస్పీకి సూచనలు అందించారు.