జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని చిరు నగర్ లో ఉన్న ఉక్కు కళా వేదిక వద్ద ఉన్నటువంటి డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. దినితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో దోమలు చేరుతూ అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.