పెనుగంచిప్రోలు మండల పరిధిలోని మునేటి తీర ప్రాంతంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో మంగళవారం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 11 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.