గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇటీవల కంకిపాడులో జరిగిన ‘పల్లె పండుగ’లో మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి సమస్యను డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తెచ్చారు. స్పందించిన పవన్ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆర్ డబ్యూ ఎస్అధికారిని ఆదేశించారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ నీటి పరీక్షలు చేసిన అనంతరం రక్షిత తాగునీరు సరఫరాలోని లోపాలను గుర్తించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ 12 పనులకు రూ.91 లక్షలు కేటాయించారు.