గన్నవరం: అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం
ఎన్డీయే పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని గన్నవరం నియోజక వర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు అన్నారు. గురువారం దీపం-2 పథకంలో భాగంగా గన్నవరం క్యాంప్ కార్యాలయం నందు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆయన నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నారు.