ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, శాసన సభ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయం నందు గన్నవరం నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య కారణాలతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్న 12మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు. ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్భందువునిగా అదుకుంటుందని ఆయన తెలిపారు.