నాగాయలంక: నాలుగు కేసుల అక్రమ మద్యం స్వాధీనం
ఆకస్మిక దాడులు చేసి నాలుగు కేసుల అక్రమ మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ఐ ఎం. రామశేషయ్య తెలిపారు. శనివారం అవనిగడ్డ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో ఎన్ ఫోర్స్ మెంట్ ఈడీ ఆదేశాలతో నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో ఆకస్మిక దాడులు చేసినట్లు తెలిపారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో 197 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.