కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానం పథకమునకు దాత లక్ష విరాళం గురువారం అందజేశారు. హైదరాబాద్ వాస్తవ్యులు బులుసు శంకరం రూ. 1, 00, 000లు ఆలయ సూపర్డెంట్ బొప్పన సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్బంగా దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.