ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు అధిక లాభాలు అర్జించవచ్చునని అవనిగడ్డ మండల ఉద్యాన శాఖ అధికారి ఎన్. రమేష్ పేర్కొన్నారు. బుధవారం అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో రైతులకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉండవల్లి అగ్రోస్ ఆధ్వర్యంలో ఉచితంగా పామాయిల్ మొక్కలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే వారికి ఉచిత సబ్సిడీలు అందుతాయని తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.