విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15వరకు భవానీ దీక్షల స్వీకరణ జరుగుతున్నట్లు గురువారం ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్1వ తేదీన అర్ధమండల దీక్షల స్వీకరణ ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తుంది. డిసెంబర్ 21 నుంచి 25 వరకు దీక్షలవిరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21నుంచి 26 తేదీ వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలునిర్వహిస్తారు.