21వ అఖిలభారత పశుగణన కార్యక్రమాన్ని మండలంలోని వావిలాల వెటర్నరీ డిస్పెన్సరీలో శుక్రవారం ప్రారంభించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి. శ్వేత పశుగణనపై పశుసంవర్ధక శాఖ రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 25 నుంచి 2025 ఫిబ్రవరి 25 వరకు ఈ పశుగణన సర్వే జరుగుతుందని తెలిపారు. రైతులందరూ తమ పశువులను పశుగణనలో చేర్చాలని కోరారు.