తిరువూరు మండలం రాజుపేటలోని కుటుంబ సలహా కేంద్రాన్ని రెవిన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ నివసించే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో మాట్లాడి, వారికి అందిస్తున్న సదుపాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీ సమయంలో సీడీపీవో సత్యవతి, ఇతర ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.