ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి అనిత పనితీరు పై ఆరోపణ చేయటం చూస్తుంటే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తుంటే కూటమిలో బీటలు తప్పవన్నారు. త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ చిత్రపటం తొలగింపు ఖాయమే అని విమర్శించారు.