రాజమండ్రి: కాంగ్రెస్ పార్టీ పదవులకు బాలేపల్లి రాజీనామా

60பார்த்தது
రాజమండ్రి నగర, రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వెల్లడించారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో నగర, రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி