రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు కృషి చేస్తుందన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.