2025 జనవరి 5న ఆంధ్రప్రదేశ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని హిందూ సంఘాల ఐక్యవేదిక నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం పెడన పట్టణంలోని పడమట వీధిలోని విగ్నేశ్వర ప్రార్ధన మందిరం నందు జరిగిన సభలో కరపత్రాలు విడుదల చేశారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సభ్యులు పత్తిపాటి రమణ మాట్లాడుతూ, హిందువులు అందరూ ఐక్యత కలిగి జీవించాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.