కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం పెదపారుపూడి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారం వాటికి ఇచ్చిన ఎండార్స్మెంట్లను కలెక్టర్ పరిశీలించారు. భూ సమస్యలకు సంబంధించి ఇళ్ళ స్థలాల పంపిణీ సంబంధించిన ఫైళ్ళు, ఆర్ఓఆర్ రిజెక్షన్స్, మ్యుటేషన్స్ ఫైళ్ళు ర్యాండం తనిఖీ చేశారు.