మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నిర్వహించిన కౌలు రైతు కార్డు సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ జడ్పీటీసీ దొండపాటి రాము పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు ప్రభుత్వ పథకాలను సద్వినియోగపర్చుకుని వ్యవసాయాన్ని లాభసాటి చేసుకోవాలని ప్రతి ఒక్క వ్యవసాయ అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని, శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి రైతులను చైతన్య పర్చాలని పేర్కొన్నారు.