రెడ్డిగూడెం ఎం.డి.ఓ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో బుధవారం నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. గ్రామసభను ఉద్దేశించి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రామ సభలు సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.