మహిళా పోలీసులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు సజావుగా నిర్వహించామని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నం పోలీసు హల్ లో కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ బదిలీలను ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల మేరకే చేస్తామని, బదిలీలు కోరుకునే ఉద్యోగిని తన స్వగ్రామం/వార్డు ఉండే సచివాలయం మినహా ఇతర సచివాలయాలను కోరుకోవాలన్నారు.