ప్రభుత్వం చెల్లించాల్సిన నగదును తిరిగి ఇప్పించేలా చర్యలు చేపట్టాలని ఘంటసాల మండలం తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, జెసి గీతాంజలి శర్మను కోరారు. సోమవారం మచిలీపట్నంలో జరిగిన మీకోసంలో వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం పొలాన్ని ప్రభుత్వ అధికారులు కొన్నారని చెప్పారు. కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన నగదు యజమాని నుంచి ఇప్పించాలన్నారు.