రాష్ట్రానికి భారీ పెట్టుబడును తెచ్చేందుకు మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటించి పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారన్నారు.