ఖరీఫ్ సీజన్ 2024కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు కృషి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి పార్వతి రెవిన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం మచిలీపట్నంలో డిప్యూటీ తహసిల్దార్లు, వీఆర్వోలకు జిల్లాలో ధాన్యం సేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మొబైల్ యాప్ ఉపయోగించే తీరును ఆమె వివరించారు.