విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించుకునేందుకు.. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ జిల్లా ప్రజలను కోరారు. శుక్రవారం మచిలీపట్నంలో సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన పరచాలన్నారు.