సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 14 వ తేదీన విజయవాడలో జరిగే ప్రజాపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జగ్గయ్యపేట మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి పిలుపునిచ్చారు. మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో శుక్రవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయడంలో విఫలం చెందాయని ఆరోపించారు.