గుడివాడ ఇందిరానగర్ కాలనీలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ నీట మునిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నమంటూ, విజయవాడ రహదారిలో బేతవోలు పెద్దపేట కాలనీవాసులు మంగళవారం రాత్రి ధర్నా నిర్వహించారు. కాలనీ ముంపుకు గురై పాములు విష జంతువులు ఇళ్ళల్లోకి ప్రవేశిస్తున్నాయని, తాము నిద్రపోవడానికి కూడా భయంగా ఉందని కాలనీ వాసులు తెలిపారు. ఓట్లు కోసం వచ్చే రాజకీయ నాయకులు తమ ఇబ్బందులను కూడా గుర్తించాలన్నారు.