గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పట్టభద్రులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 6 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు.