ఉంగుటూరు మండలంలోని తేలప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సాధారణ మరియు క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. పార్టీ నాయకులు గ్రామంలోని పట్టభద్రులను గుర్తించి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఆళ్ల కృష్ణారెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.