యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని కోడూరు ఎస్ఐ చాణిక్య అన్నారు. బుధవారం కోడూరు శివారు స్వతంత్రపురం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని, మంచి స్నేహితుల ద్వారా మంచి లక్షణాలు అలవర్చుకోవాలని తెలిపారు.