టిడిపి కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని టీడీపీ రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కోడూరు మండల టిడిపి విస్తృత స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోడూరు మండలంలోని, ప్రధాన సమస్యలైన కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం, అవుట్ ఫాల్ స్లూయిస్ నిర్మాణం గురించి ఆయన దృష్టికి తీసుకువచ్చారు.