ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల పాలెం ఘోటకం మాలపల్లిలో గురువారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన ఉప్పులేటి సుదర్శన్ - లావణ్య దంపతులు ఇంటిలో లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటిలోని వస్తువులు, బీరువా, మంచం, పిల్లల పుస్తకాలు, ఇతర సామాగ్రి మొత్తం కాలిపోయాయి. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.