కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీవో) అరుణను చల్లపల్లి గ్రామ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి మర్యాదపూర్వకంగా మంగళవారం సాయంత్రం కలిశారు. ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన అరుణను మచిలీపట్నం డీపీఓ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ తో పాటు ఈఓ పీవీ. మాధవేంద్రరావు ఉన్నారు. చల్లపల్లి లో జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాలు గురించి డీపీఓ వివరాలు అడిగి తెలుసుకున్నారు.