కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అరుదైన గౌరవం లభించింది. అమలాపురంలో తాను చదువుకున్న కళాశాలకే శనివారం ముఖ్య అతిథి హోదాలో హాజరైయ్యారు. శనివారం ఎస్. కె. బీ. ఆర్ కళాశాలలో 'చదువుల కోసం పని' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేరింతలు కొడుతూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ. తాను చదువుతున్న కాలేజీకే మంత్రిగా రావడం గొప్ప అనుభూతి పొందాను అని తెలిపారు.