పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా 'అకిరా మియావాకీ' కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద డ్వామా ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.