రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని రాజమండ్రిలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉచిత ఇసుక హామీ చిత్తశుద్దిగా అమలు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.