పెద్దాపురం మండలంలో సారా కేసులలో గల పది మంది ముద్దాయిలను బైండోవర్ చేశారు. ఈ మేరకు శనివారం పెద్దాపురం ఎమ్మార్వో కార్యాలయంలో తహశీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి ముందు 10 మంది ముద్దాయిలను ఎక్సైజ్ సిబ్బంది ప్రవేశపెట్టారు. ఈ ముద్దాయిలపై గతంలో సారా కేసులు నమోదు అయ్యాయని ఎస్ఐ మౌనిక తెలిపారు. యువత వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.